UPSC Indian Forest Service exam 2022: డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలివే..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS- 2022) ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 151 పోస్టులను భర్తీ చేయనుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS- 2022) ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 151 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే. ఫిబ్రవరి 22 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
పోస్టుల వివరాలు: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ – 2022
మొత్తం ఖాళీలు: 151
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022 నాటికి 21 ఏళు ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే ఆగస్టు 2, 1990 నుంచి ఆగస్టు 1, 2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజ్‌లలో జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష:
ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు.
ఇంకా పరీక్షలకు సంబంధించిన సిలబస్ వంటి ఇతర ముఖ్య సమాచారం కోసం యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ 100 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in/