యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ వివిధ పోస్టుల భర్తీకి సరైన అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ లో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌‌లైన్ విధానంలోనే దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred


పోస్టుల వివరాలు.

మొత్తం ఖాళీలు: 15

also read ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌‌లో టీచింగ్ పోస్టుల ఖాళీలు


పోస్టులు ఖాళీలు
డిప్యూటీ రిజిస్ట్రార్‌ 01
అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌ 01
సీనియ‌ర్ అసిస్టెంట్ 01
ప్రొఫెషనల్ అసిస్టెంట్ 01
జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 01
లైబ్రరీ అటెండెంట్ 01
స్టెనో గ్రాఫ‌ర్‌ 01
హిందీ టైపిస్ట్ 01
మెస్ సూపర్‌వైజర్ 01
ల్యాబొరేటరీ అసిస్టెంట్ 02
లైబ్రరీ అసిస్టెంట్ 01
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 03
మొత్తం ఖాళీలు 15

అర్హత‌: పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. డిగ్రీ మరియు సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత‌ పొంది ఉండాలి. అలాగే తగిన అనుభ‌వం కూడా అవసరం.

వయోపరిమితి: డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుకు 50 సంవత్సరాలు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు 45 సంవత్సరాలు, సీనియర్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు 40 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 30 సంవత్సరాలలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

also read MIDHANI Jobs: మిధానీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ వెల్లడి: 22.11.2019
దరఖాస్తు సమర్పణకు చివరితేది: 30.12.2019.

చిరునామా:
Assistant Registrar,
Admistrative Building,
University of Hyderabad,
Gachibowli-500 046.
Hyderabad.