తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతి ఉంటే చాలు..
తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పాసైన మహిళలు అర్హులు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తులకు చివరితేది జులై 31.
తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్‌వాడీ ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. అశ్వరాపుపేట, దమ్మపేట మండలాల్లోని అంగన్వాడీ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా నియమకాలు చేపట్టారు. ఇందులో మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు జులై16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 31 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో అశ్వారావుపేట ప్రాజెక్ట్ పరిధిలో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 01, ఆయా పోస్టులు 03, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02, దమ్మపేట ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 03, ఆయా పోస్టులు 13, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02 ఉన్నాయి. అంతే కాకుండా బూర్గంపాడు, చంద్రుగొండా, చర్ల, దుమ్ముగూడెం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందులో కూడా ఖాళీలు ఉన్నాయి.
also read రాతపరీక్ష లేకుండా ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. బిటెక్ అర్హత ఉన్నవారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
10వ తరగతి పాసై వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికంగా నివాసం ఉండే వారు మాత్రమే ఈ ఖాళీలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను https://mis.tgwdcw.in/ వెబ్ సైట్‌లో చూడవచ్చు.
ఎలా అప్లయ్ చేసుకోవాలంటే ?
1. అధికారిక వెబ్ సైట్ http://wdcw.tg.nic.in సందర్శించి, అందులో ఉన్న ఆన్ లైన్ ధరఖాస్తు నింపల్సి ఉంటుంది.
2. ధరఖాస్తు ఫార్మ్ నింపిన తరువాత సబ్మిట్ పై క్లిక్ చేసే ముందు ప్రివ్యూ బటన్ నొక్కి ఫార్మ్ లో ఎలాంటి తప్పులు లేకుండా సరిచూసుకోవాలి.
3. సబ్మిట్ బటన్ నొక్కిన తరువాత అక్నాలెడ్జ్మెంట్ డౌన్ లోడ్ చేసుకోవాలి.