Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లయ్ చేసుకోవడానికి క్లిక్క్ చేయండి..

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం తాజాగా హైదరాబాద్‌ లక్డీకపూల్‌లోని పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా  మల్టీ జోన్-1, మల్టీ జోన్‌-2లో నియామకం చేపట్టనున్నారు.

telangana police recruitment notification released apply for 151 assistant public prosecutor on tslprb in here
Author
Hyderabad, First Published Aug 24, 2021, 4:41 PM IST

పోలీసు ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి శుభవార్త. తాజాగా తెలంగాణలోని అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను హైదరాబాద్‌ లక్డీకపూల్‌లోని పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చివరితేదిని సెప్టెంబర్‌ 4. అభ్యర్థులు పూర్తి వివరాలకు  https://www.tslprb.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

వయో పరిమితి : రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న 151 అసిస్టెంట్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ (కేటగిరీ-7) ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిలో పదేళ్ల సడలింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు అనుగుణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే చివరితేదిని సెప్టెంబర్‌ 4 వరకు పొడిగించినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ పీవీ శ్రీనివాసరావు తెలిపారు.

 మొత్తం పోస్టులు: 151 పోస్టులు ఇందులో  మల్టీ జోన్-1లో 68 పోస్టులు, మల్టీ జోన్‌-2లో 83 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం ఉండాలి.

also read ఆగష్టు 25న భారీ జాబ్ మేళా.. 10th అర్హత ఉన్నవారు కూడా హాజరుకావొచ్చు.. జీతం ఎంతంటే ?

వయసు: అభ్యర్థులు 1 జూలై 2021  నాటికి 34 ఏళ్ల లోపు వారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు రాత పరీక్ష  ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష: పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్‌ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనికి మొత్తం 100 మార్కులు.

జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్‌ ఫీజు  రూ. 1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750గా నిర్ణయించారు.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.tslprb.in/

Follow Us:
Download App:
  • android
  • ios