నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బిఐలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ తో పాటు వివిధ పోస్టులున్నాయి.
బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా అయితే భారతదేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 148 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్, అడ్వైజర్, డేటా అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో చూడవచ్చు. అభ్యర్థులు ఎస్‌బిఐ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 3 మే.
మొత్తం ఖాళీ పోస్టులు సంఖ్య: 148 (స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు)
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
also read పరీక్ష లేకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయి చేసుకోండీ ...
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: 23 మే 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, వరంగల్, హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 3 మే 2021
అధికారిక వెబ్‌సైట్:https://www.sbi.co.in/