పరీక్ష లేకుండా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయి చేసుకోండీ

క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏ‌ఐ) ఉద్యోగాల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
 

sai recruitment 2021 released apply for 320 posts of coach and assistant coach at sportsauthorityofindia nic in

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉద్యోగాల భర్తీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏ‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన 320 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసువచ్చు. మే 20 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్  https://sportsauthorityofindia.nic.in/లో చూడవచ్చు.

 కోచ్‌ పోస్టులు 100

క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వ్రెజ్లింగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్‌ తదితర ఉన్నాయి.

అర్హత: ఎస్‌ఏ‌ఐ, ఎన్‌ఎస్‌/ఎన్‌ఐఎస్‌/ ఇతర గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఒలింపిక్‌/వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెడల్‌ సాధించి ఉండాలి లేదా ఒలింపిక్‌/అంతర్జాతీయ ప్రదర్శన చేసి ఉండాలి.

అభ్యర్ధుల వయసు: 45 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక చేసే విధానం: షార్ట్‌లిస్టింగ్, సంబంధిత విభాగం (స్పోర్ట్స్‌)లో ఇంటర్వూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి

also read గుడ్ న్యూస్: బీటెక్‌ అర్హతతో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం వెంటనే ధరఖాస్తు చ...

అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టులు 220

క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వ్రెజ్లింగ్, సైక్లింగ్, రోయింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్‌ తదితర ఉన్నాయి

అర్హత: ఎస్‌ఏ‌ఐ, ఎన్‌ఎస్‌/ఎన్‌ఐఎస్‌/ ఇతర గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి కోచింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి అలాగే నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి. ఒలింపిక్‌/అంతర్జాతీయ ప్రదర్శన చేయాలి.

వయసు: 40 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక చేసే విధానం: షార్ట్‌లిస్టింగ్, సంబంధిత విభాగం(స్పోర్ట్స్‌)లో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20 మే 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://sportsauthorityofindia.nic.in/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios