రాత పరీక్ష లేకుండా సింగరేణిలో భారీగా ఉద్యోగవకాశాలు.. మార్కుల ఆధారంగా డైరెక్ట్ జాబ్..

ఎస్‌సీసీఎల్‌  ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  
 

sccl apprentice recruitment 2021 singareni collieries company limited notification released for 1146 apprentice jobs at scclmines com

తెలంగాణలోని ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) సంస్థ  ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 28 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం  https://scclmines.com/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 1146

అప్రెంటిస్‌ కాల పరిమితి: 1 సంవత్సరం

ఖాళీలు ఉన్న ట్రేడులు: ఎలక్ర్టీషియన్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌), డీజిల్‌ మెకానిక్‌, వెల్డర్‌ 

విద్యార్హతలు: అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విద్యార్థులు అర్హులు కాదు.

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకి రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7700 చెల్లిస్తారు.

also read గుడ్ న్యూస్: విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ.. మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక.. ...

ఎంపిక: ఐటీఐ ఉత్తీర్ణతలో సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే ఏడాది అయితే ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మొదట https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. తరువాత సింగరేణి వెబ్‌సైట్‌ https://scclmines.com/apprenticeship/ లో జూన్‌ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. దీనికి సంబంధించిన జిరాక్స్‌ కాపీలను సమీప వీటీసీల్లో జూన్‌ 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలి.

జత చేయాల్సిన సర్టిఫికెట్లు: 10వ తరగతి/తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్‌, అభ్యర్థి సంతకంతో కూడిన రెండు పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటోలు, ఐటీఐ సర్టిఫికెట్‌ (సర్టిఫికెట్‌/ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ), క్యాస్ట్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు జతచేయాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28 జూన్‌ 2021

అధికారిక వెబ్‌సైట్‌: https://scclmines.com/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios