గుడ్ న్యూస్: విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ.. మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక..
విద్యాశాఖకు చెందిన 2,397 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22కు విడుదల చేసిన మొత్తం 10,143 ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2,397 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాధమిక, ఉన్నత విద్య లో భర్తీ చేయనున్న ఈ పోస్టులను అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ మీద ఆధారపడి రాత పరీక్ష తో ఎంపిక చేయనున్నామని తెలిపారు. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు విద్యాశాఖలో 5,812 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు విద్యాశాఖ మంత్రి తెలిపారు.
ఇప్పుడు 2021-22 లో...
మొత్తం 1238 బ్యాక్ లాగ్ పోస్టుల్లో విద్యాశాఖ నుంచి 157 పోస్టులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు 54 ఉన్నాయి. ఈ మొత్తం 157 పోస్టుల్లో 92 ఎస్సీ, 65 ఎస్టీ కేటగిరికి చెందినవని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
also read ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం వెంటనే అప్లయి చేసుకోండీ.. ...
ఈ పోస్టులకు జూలై 2021న నోటిఫికేషన్
డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనుండగా జనవరి 2022లో వీటికి నోటిఫికేషన్ ఇస్తారన్నారు.యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2022 లో నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా అవకాశాలు కల్పించటం జరుగుతుందని దళారులు, లంచగొండితనం లేకుండా మెరిట్ మీదనే ఉద్యోగాలు దక్కటంతో అందరూ జగనన్నను అభినందిస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు.
శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.