డిగ్రీ అర్హతతో రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు.. కొద్ది రోజులే అవకాశం..
వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ద్వారా కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ) నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ద్వారా కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. '
ఈ పోస్టులను అకడమిక్ మెరిట్, వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు. జనవరి 28 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://rangareddy.telangana.gov.in/ చూడవచ్చు. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు 22.
1) డేటా ఎంట్రీ ఆపరేటర్: 09 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.11,550 చెల్లిస్తారు.
2) అకౌంటెంట్లు: 13 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
వయసు: 01.07.2021 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, వయసు ఆధారంగా అలాగే మొత్తం 100 మార్కలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందులో 90 మార్కులు అకడమిక్ మార్కులకు, మిగతా మార్కులు వయసుకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: పూర్తిగా నింపిన దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి నేరుగా లేదా పోస్టు ద్వారా కింద సూచించిన చిరునామాకి పంపించాలి.
చిరునామా:
డీఎంహెచ్ఓ,
పీవీఎన్‌ర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబరు 294 దగ్గర,
మణికంఠ కాలనీ, శివరాంపల్లి, రాజేంద్రనగర్,
రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 25 జనవరి 2021.
దరఖాస్తుకు చివరి తేది: 28 జనవరి 2021
అధికారిక వెబ్‌సైట్:https://rangareddy.telangana.gov.in/