నిరుద్యోగ యువతి,యువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : మేడ్చల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతి,యువకులకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు నిరుద్యోగ యువతి,యువకుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులగా నిర్ణయించారు.

also read టీఎస్‌ ఐసెట్‌-2020 పరీక్ష షెడ్యూల్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

దేవరయాంజల్‌లోని ఎస్సీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శిక్షణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇతర వివరాలకు సంబంధించి మేడ్చల్‌ కలెక్టరేట్‌లోని బి బ్లాక్‌లో గల జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో సంప్రందించాలని సూచించారు.