టీఎస్‌ ఐసెట్‌-2020 పరీక్ష షెడ్యూల్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

టీఎస్‌ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.

tsicet 2020 exam dates schedule released by convener rajireddy

హైదరాబాద్‌ : టీఎస్‌ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదలైంది. దీనిని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల మార్చ్ 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.

దరఖాస్తులు సమర్పించటానికి  మార్చి 30 చివరి తేదీగా నిర్ణయించారు. కాగా లెట్ ఫీజు రూ. 500 ఫైన్‌తో మే 14 వరకు, రూ. 5 వేల ఫైన్‌ చెల్లించి మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

also read TS EAMCET : ఎంసెట్‌ నోటిఫికేషన్ 2020 విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

మే 20, 21 తేదీల్లో ఐసెట్‌-2020 పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ వెల్లడించారు. మే 14 నుంచి ఐసెట్‌- పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచన్నరు. మే 27న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఈ సారి ఐసెట్‌ పరీక్ష రాసే అభ్యర్డులు నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించారు. 

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కన్వీనర్‌ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios