Asianet News TeluguAsianet News Telugu

పోస్టల్ డిపార్టుమెంట్ లో ఉద్యోగాలు...మరో 2 రోజులే గడువు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల ఉద్యోగాలకు గాను ఏపీ సర్కిల్‌లో 2707 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌లో 970 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
 

postal department jobs in AP and telangana
Author
Hyderabad, First Published Nov 12, 2019, 6:08 PM IST

ఏపీ, తెలంగాణలో పోస్టల్ డిపార్టుమెంట్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం పదోతరగతి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అర్హతగల అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నవంబరు 14తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నవంబరు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం ఉంది.

also read ఎస్‌ఎస్‌సి ( మల్టీ టాస్కింగ్ స్టాఫ్) 7,099 ఖాళీలను ప్రకటించింది

అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు జరుగుతాయి.    

ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 3677 పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 14న రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

aslo read civil service jobs: సివిల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదల


తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల ఉద్యోగాలకు గాను ఏపీ సర్కిల్‌లో 2707 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌లో 970 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.


ముఖ్యమైన తేదీలు..

  •  రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019
  • రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019
  • ఆన్‌లైన్ దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.11.2019.
Follow Us:
Download App:
  • android
  • ios