రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
గోరఖ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్రర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతితోపాటు సంబంధిం విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం వీరిని శిక్షణకు పంపిస్తారు. వీరికి 2020 ఏప్రిల్‌లో సంబంధిత యూనిట్/డివిజన్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. అయితే అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తయిన తర్వాత రైల్వేల్లో ఎలాంటి ఉద్యోగ హామీ ఉండదని అభ్యర్థులు గమనించగలరు.
also read AFCAT -ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(2020) నోటిఫికేషన్ విడుదల
పోస్టుల వివరాలు.
అప్రెంటిస్ పోస్టులు: 1104
పోస్టులు ఖాళీలు
మెకానికల్ వర్క్‌షాప్ 411
సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) 63
బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్) 35
మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్ నగర్) 151
డీజిల్ షెడ్ (ఇజ్జత్ నగర్) 60
క్యారేజ్ & వ్యాగన్ (ఇజ్జత్ నగర్) 64
క్యారేజ్ & వ్యాగన్ (లక్నో జంక్షన్) 155
డీజిల్ షెడ్ (గోండా) 90
క్యారేజ్ & వ్యాగన్ (వారణాసి) 75
మొత్తం ఖాళీలు 1104
శిక్షణ కాలం: ఏడాది.
అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
also read యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు
వయోపరిమితి: 25.12.2019 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ప్రాసెసింగ్ ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, EWS, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.10.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.12.2019 (సా. 5 గం.)
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 28, 2019, 11:31 AM IST