Asianet News TeluguAsianet News Telugu

రాత పరీక్ష లేకుండా ఆయిల్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

నిరుద్యోగుల కోసం ఆయిల్ ఇండియా  ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

oil india recruitment 2021 released apply for 119 assistant mechanic and other posts recruitment through walk in interview
Author
Hyderabad, First Published May 7, 2021, 5:46 PM IST

దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన ఆయిల్ ఇండియా నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నీ వివిధ విభాగాల్లో ఉన్నాయి. అయితే ఎంపికైన అభ్య‌ర్థులు అసోంలోని డిబ్రూగ‌ఢ్‌లో ప‌నిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

అర్హత, ఆస‌క్తిగల అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ ఎంపికలు ఉంటాయి. మే 22 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.oil-india.com/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 119
గ్యాస్ లాగర్ - 20, అసిస్టెంట్ మెకానిక్ - 79, డ్రిల్లింగ్ టాప్ మ్యాన్ -17, కెమికల్ అసిస్టెంట్ - 10, అసిస్టెంట్ రిగ్ ఎలక్ట్రీషియన్ - 10, ఎలక్ట్రిక్ సూపర్ వైజర్ - 5, డ్రిల్లింగ్ రిగ్ మ్యాన్ - 5, డ్రిల్లింగ్ హెడ్ మ్యాన్ - 4 ఉన్నాయి.

also read ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల : దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశం ...

విద్యార్హతలు:
పోస్టులను బట్టి వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఆయా ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు. 

వయోపరిమితి: వయో పరిమితి కూడా వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా నిర్ణయించారు. కెమికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారై ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్‌ లో స్పష్టం చేశారు.


దరఖాస్తు ప్రక్రియ:
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 22లోగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను మే 24 నుంచి జూన్ 22 వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://www.oil-india.com/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios