Asianet News TeluguAsianet News Telugu

ECIL'లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు...నెలకు 67వేల జీతం

హైద‌రాబాద్‌ నగరంలోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులను స్వీకరిస్తున్నారు. 

trainee engineer posts openings in ecil
Author
Hyderabad, First Published Dec 7, 2019, 12:48 PM IST

హైద‌రాబాద్‌ నగరంలోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఖాళీలు ఉన్న సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి, గేట్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఖాళీగా ఉన్న పోస్టుల వివ‌రాలు

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ: 64 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు

ఈసీఈ: 30

also read AIR Jobs : అల్ ఇండియా రేడియోలో ఉద్యోగ అవకాశాలు...

మెకానికల్: 24

సీఎస్ఈ: 10


ఉండాల్సిన అర్హత‌: 65 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ అర్హత తప్పనిసరి.

గరిష్ఠ వయసు: 30.11.2019 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వూ, గేట్ స్కోరు ఆధారంగా.

also read BHEL jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


స్టైపెండ్: ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో నెలకు రూ.48,160 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. పీఎఫ్, సెలవులు కూడా వర్తిస్తాయి.

వేతనం: ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు ఇంజినీర్‌ హోదాలో విధిగా మూడేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది.

విధుల్లో చేరిన తర్వాత మొదటి సంవత్సం నెలకు రూ.67,920, రెండో సంవత్సరం నెలకు రూ.69,960, మూడో సంవత్సరం నెలకు రూ.72,060 వేతనంగా చెల్లిస్తారు. అదే విధంగా టెక్నికల్ ఆఫీసర్‌గా నియామకం పొందినవారికి నెలకు రూ.40,000-3%-140,000 వేతనంగా ఇస్తారు. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం.
 

Follow Us:
Download App:
  • android
  • ios