భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ దరఖాస్తులను కోరుతున్నారు. పీజీ లేదా డిగ్రీతో పాటు తగిన అనుభవం కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీగా ఉన్న విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, లా, జనరల్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ మొదలగునవి.

also read  ECIL'లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు...నెలకు 67వేల జీతం

కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరో 2 సంవత్సరాల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఉండాల్సిన అర్హత, వయసు
యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ లేదా డిగ్రీతో పాటు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20.12.2019 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

also read BHEL jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం: అభ్యర్థుల మెరిట్ ఆధారంగా 1 : 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక ఖరారు చేస్తారు.

జీతం: రూ.40,000 ఫిక్స్‌డ్. ఎలాంటి అదనపు భత్యాలు ఉండవు. సంవత్సరానికి 30 సెలవులు ఉంటాయి.

​ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.12.2019 (05:00 PM)