ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప‌ర్మనెంట్, షార్ట్ స‌ర్వీస్‌ క‌మిష‌న్‌ల‌లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (AFCAT-2020) నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతీ సంవత్సరం రెండుసార్లు AFCAT ప్రకటన వెలువడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మే/జూన్ నెలలో మొదటి విడత, డిసెంబరులో రెండో విడత నోటిఫికేషన్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ విడుదల చేస్తోంది. 2021 జనవరిలో కోర్సు ప్రారంభంకానుంది.


ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ - 2020

మొత్తం ఖాళీలు: 249

also read  PSC jobs: పబ్లిక్ సర్వీస్ కమిషన్(సివిల్)లో అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీల ప్రకటన

విభాగాలు: ఫ్లైయింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌), ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ (ఫ్లైయింగ్‌).

భాగాల వారీగా ఖాళీలు..

ఫ్లైయింగ్‌ (SSC)- 60

గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌)- 105

గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నిక‌ల్‌) - 84

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ (ఫ్లైయింగ్‌)- CDSE, AFCATలో 10 % సీట్లు


అర్హత: డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ బీకాం డిగ్రీతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత‌ ఉండాలి. NCC స‌ర్టిఫికెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

also read  ISRO JOBS:ఇస్రోలో ఉద్యోగ అవకాశం...డిగ్రీ, డిప్లొమా అర్హత...ఉంటే చాలు

వ‌యోపరిమితి: ఫ్లైయింగ్‌ బ్రాంచ్ పోస్టులకు 01.07.2020 నాటికి 20 నుంచి 24 సంవత్సరాలలోపు ఉండాలి. మిగతా బ్రాంచ్‌ పోస్టులకు 20 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టుల‌కు రూ.250 చెల్లించాలి. మిగతా విభాగాలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఎలాంటి ఫీజు చెల్లించన‌వ‌స‌రం లేదు.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2019

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.12.2019