కేరళలోని కొచ్చిలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షిప్‌యార్డ్ లోని  సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత పొందినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

also read SAI Jobs: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం

నోటిఫికేషన్  వివ‌రాలు

షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టులు

మొత్తం ఉన్న ఖాళీలు: 29

విభాగాల వారీగా ఖాళీలు: మెకానిక‌ల్‌-11, ఎల‌క్ట్రిక‌ల్‌-18.

ఉండాల్సిన అర్హత‌: డిప్లొమా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో  (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. డ్రాఫ్ట్‌మెన్‌షిప్ నైపుణ్యాలతోపాటు క్యాడ్ తెలిసి ఉండాలి.

వ‌యోపరిమితి: 20.12.2019 నాటికి 25 సంవత్సరాలకు మించ‌కూడ‌దు.

also read ఎన్‌టి‌ఆర్ ట్రస్ట్ స్కాలర్ షిప్ టెస్ట్ 2019...


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్, ప్రాక్టిక‌ల్ పరీక్షల ఆధారంగా.

శిక్షణ: ఎంపికైనవారికి రెండేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. అవసరానికి అనుగుణంగా మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది.

స్టైపెండ్: శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.12,600, రెండో సంవత్సరం నుంచి నెలకు రూ.13,800 స్టైపెండ్‌గా ఇస్తారు. అదనపు పనిగంటలకు అదనపు వేతనం ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.12.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.12.2019.