Asianet News TeluguAsianet News Telugu

Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 2022 సంవత్సరానికి గానూ 47వ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

Indian Army Recruitment 2022
Author
Hyderabad, First Published Jan 26, 2022, 2:04 PM IST

నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 2022 సంవత్సరానికి గానూ 47వ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. 

-పోస్టు వివరాలు: ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
-మొత్తం ఖాళీల సంఖ్య: 90
-పే స్కేల్: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం -సబ్జెక్టులుగా ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. జేఈఈ మెయిన్- 2021 పరీక్షకు హాజరై ఉండాలి. నోటిఫికేషన్లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.

-వయోపరిమితి: అభ్యర్థులు జనవరి 2, 2003 నుంచి జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం 5 రోజులు నిర్వహిస్తారు. ఈ సమయంలో వివిధ స్టేజుల్లో అభ్యర్ధులను పరీక్షించడం జరుగుతుంది.
-ఎంపికైనవారికి ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు ఆఫీసర్లుగా నియామకాలు జరుగుతాయి. 
*ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలు ప్రారంభం: ఏప్రిల్ 2022
*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
*దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022.
*పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

Follow Us:
Download App:
  • android
  • ios