యూపీఎస్‌సి నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
వీటికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 10 వరకు అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 35
ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్-24, రిసెర్చ్ ఆఫీసర్-1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-7 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టుకు ఎంబీబీఎస్‌తోపాటు న‌్యూరాలజీలో పీజీ చేసి, మూడేండ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
also read ఆగష్టు 31న టీఎస్ఈసెట్ ఎగ్జామ్.. అడ్మిట్ కార్డు వివరాల కోసం క్లిక్క్త్ చేయండి.. ...
రిసెర్చ్ ఆఫీసర్‌కు ఆంథ్రోపాలజీలో ఎండీ చేసి ఉండాలి, సోషల్ రిసెర్చ్‌లో మూడేండ్ల అనుభవం తప్పనిసరి.
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌కు సైకాలజీ లేదా క్రిమినాలజీలో ఎండీ, సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు హోమియోపతిలో డిగీ్ర చేసిఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 10
పూర్తి వివరాలకు: upsconline.nic.in