Asianet News TeluguAsianet News Telugu

ఆగష్టు 31న టీఎస్ఈసెట్ ఎగ్జామ్.. అడ్మిట్ కార్డు వివరాల కోసం క్లిక్క్త్ చేయండి..

దరఖాస్తు చేసుకున్న వారు అధికారిక వెబ్‌సైట్ tsche.ac.in లో అడ్మిట్ కార్డు వివరాలు, అడ్మిట్ కార్డు విడుదల తేదీలను చెక్ చేసుకొవచ్చు. తెలంగాణ  నిర్వహించనున్న ఏడు కమాన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఈ‌సి‌ఈ‌టి మొదట నిర్వహించనున్నారు. 

Telangana ECET to be conducted on August 31 and admitcards released on tsche.ac.in
Author
Hyderabad, First Published Aug 21, 2020, 5:42 PM IST

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజి  యూనివర్సిటీ( జెఎన్‌టియు) ఈ ఏడాది ఆగస్టు 31న తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, (టిఎస్‌ఇసిటి) 2020ను నిర్వహించనుంది. దరఖాస్తు చేసుకున్న వారు అధికారిక వెబ్‌సైట్ tsche.ac.in లో అడ్మిట్ కార్డు వివరాలు, అడ్మిట్ కార్డు విడుదల తేదీలను చెక్ చేసుకొవచ్చు.

తెలంగాణ  నిర్వహించనున్న ఏడు కమాన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఈ‌సి‌ఈ‌టి మొదట నిర్వహించనున్నారు. టి‌ఎస్‌సి‌హెచ్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 తేదీని తెలియజేసింది. నోటీసులో “టి‌ఎస్‌ఈ‌సి‌ఈ‌టి 2020 పరీక్ష తేదీ 31/08/2020. ఇతర వివరాల కోసం దయచేసి అధికారిక వెబ్ పేజీని చూడండి. ” అని తెలిపింది.

టి‌ఎస్ ఈ‌సి‌ఈ‌టి 2020 : అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ

తాత్కాలిక పరీక్ష తేదీల గురించి, పరీక్ష అడ్మిట్ కార్డులు లేదా హాల్ టికెట్ల విడుదల గురించి టిఎస్‌సిహెచ్‌ఇ తెలియజేసింది. నోటీసు ప్రకారం అడ్మిట్ కార్డులను తాత్కాలికంగా ఆగస్టు 25న అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.in లో విడుదల చేయనుంది.

also read డిగ్రీ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల.. ...

విద్యార్థులు వారి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పత్రికా ప్రకటన ప్రకారం జెఎన్‌టియు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తుంది. ఈ పరీక్ష తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 56 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి ఎం‌హెచ్‌ఏ జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను కొనసాగిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ రీతిలో టిఎస్ఇసిఇటి 2020 శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని నోటీసులో పేర్కొన్నారు.

వాటిని ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి వివిధ మాక్ పరీక్షలు అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తాయని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.in ని చూడండి

Follow Us:
Download App:
  • android
  • ios