భారత ప్రభుత్వ ఎంటర్‌ప్రైస్ టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) 58 జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్స్, మేనేజర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో నియామకాలు జరుగుతాయి. ఏప్రిల్ 22, 2019 నుంచి మే 14, 2019లోగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.

పోస్టులు: జనరల్ మేనేజర్స్, డిప్యూటీ, అసిస్టెంట్ మేనేజర్స్

సంస్థ: టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్)

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  బీఈ/బీటెక్/సీఎంఏ/ఎంబీఏ

అనుభవం: నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన విధంగా.

జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ, ఇండియా

జీతం వివరాలు: హోదాను బట్టి నెలకు రూ. 40,000-2,60,000

ఇండస్ట్రీ: టెలికమ్యూనికేషన్స్

పోస్టుల సంఖ్య: 58

అసిస్టెంట్ మేనేజర్: 28
డిప్యూటీ మేనేజర్: 20
జనరల్ మేనేజర్: 07
మేనేజర్: 03

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 22, 2019
దరఖాస్తు చివరి తేదీ: మే 14, 2019

వయో పరిమితి: జనరల్ మేనేజర్స్, డిప్యూటీ, అసిస్టెంట్ మేనేజర్స్ అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన విధంగా 30-50ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

జనరల్, ఓబీసీ అభ్యర్థులు..   
"TELECOMMUNICATIONS CONSULTANTS INDIA LIMITED", payable at Delhi పేర దరఖాస్తు ఫీజుగా రూ. 1000 డీడీ రూపంలో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.

దరఖాస్తు:

అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి 
"The Group General Manager (HRD), Telecommunications Consultants India Ltd., TCIL Bhawan, Greater Kailash -I, New Delhi - 110048," అడ్రస్‌కు మే 14, 2019లోగా పంపాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.