Asianet News TeluguAsianet News Telugu

ssc exams: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి) పరీక్ష తేదీలు విడుదల..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణం లాక్ డౌన్ విధించారు. దీంతో అన్నీ రంగాలు స్థాభించిపోయాయి. గతంలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించాల్సిన ఉన్న పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధుల్లో గందరగోళం ఏర్పడింది. 

staff selection commission ssc announces exam dates schedule
Author
Hyderabad, First Published Jun 2, 2020, 3:47 PM IST

న్యూఢిల్లీ: గత కొన్ని నెలల తరువాత నిర్వహించాల్సి ఉన్న  పరీక్ష తేదీల వివరాలని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణం లాక్ డౌన్ విధించారు. దీంతో అన్నీ రంగాలు స్థాభించిపోయాయి. గతంలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించాల్సిన ఉన్న పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధుల్లో గందరగోళం ఏర్పడింది. తాజాగా లాక్ డౌన్ సడలింపుతో వాయిదా పడిన వివిధ పరీక్షల తేదీలను స్టాఫ్‌సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటించింది. గతేడాది విడుదల చేసిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ సెకండరీ లెవల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌), జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామినేషన్‌ (పేపర్‌-1), స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్-సీ, డీ, కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (టైర్‌-2), ఈ ఏడాది విడుదల చేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ ఢిల్లీ పోలీస్‌ అండ్‌ సీఆర్‌పీఎఫ్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ (పేపర్‌-1) పరీక్షలకు సంబంధించిన తేదీలను తాజాగా వెల్లడించింది. 

సీహెచ్‌ఎస్‌ఎల్‌-2019 (టైర్‌-1) ఆగస్టు 17 నుంచి 21 వరకు, ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామినేషన్‌-2019 (పేపర్‌-1)- సెప్టెంబర్‌ 1 నుంచి 4 వరకు నిర్వహిస్తారు.

also read డీఆర్‌డీఓలో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండీ.

 సెలెక్షన్‌ పోస్ట్‌ ఎగ్జామినేషన్‌ 2020-ఫేజ్‌ 8- సెప్టెంబర్‌ 7 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సీ, డీ ఎగ్జామినేషన్‌- 2019- ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ ఢిల్లీ పోలీస్‌ అండ్‌ సీఆర్‌పీఎఫ్‌ ఎగ్జామినేషన్‌ (పేపర్‌-1)- 2020- సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు నిర్వహిస్తారు.

 జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ అండ్‌ హిందీ ప్రధ్యాపక్‌ ఎగ్జామినేషన్‌ (పేపర్‌-1)-2020- అక్టోబర్‌ 6న, సీజీఎల్‌ (టైర్‌-2)-2019- అక్టోబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తారు.

పరీక్ష సమయాలు, తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ లో పొందుపరిచమని, ఆసక్తిగల వారు వెబ్‌సైట్‌ సందర్శించవచ్చని  ఎస్‌ఎస్‌సి వెల్లడించింది. అయితే ఎస్‌ఎస్‌సి నిర్వహించే పరీక్షల్లో సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ చాలా ముఖ్యమైనవి. సీహెచ్‌ఎస్‌ఎల్‌లో భాగంగా లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌ లేదా జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ లేదా సార్టింగ్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను 10+2 అర్హతతో భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉండే ఖాళీలను ఎస్‌ఎస్‌సి సీజీఎల్‌ ద్వారా భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios