డీఆర్‌డీఓలో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండీ.

బీ-టెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్‌డీఓలో 185 పోస్టులు భర్తీ సిద్దంగా ఉన్నాయి.

drdo recruitment 2020 defence research and development organisation to begin application for 185 scientist posts tomorrow

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఉన్న 167 సైంటిస్ట్ బీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు మొదట ప్రకటించింది. వీటికి మరో 18 పోస్టులను కొత్తగా కలుపుతున్నట్టు తాజాగా వెల్లడించింది.

దీంతో ఖాళీ పోస్టుల సంఖ్య  167 నుంచి 185 కి పెరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 22 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి  10 జూలై 2020 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


డీఆర్‌డీఓలో ఉన్న ఖాళీల పూర్తి వివరాలు...

మొత్తం ఉన్న ఖాళీలు సంఖ్య: 185

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్:  41
మెకానికల్ ఇంజనీరింగ్: 43
కంప్యూటర్ సైన్స్: 32
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 12
మెటల్లార్జీ: 10
ఫిజిక్స్: 8
కెమిస్ట్రీ: 7

also read  ఏపీ డీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల... దరఖాస్తు చేయండిలా... ...


కెమికల్ ఇంజనీరింగ్: 6
ఏరోనాటికల్ ఇంజనీరింగ్: 9
సివిల్ ఇంజనీరింగ్ : 3
మ్యాథమెటిక్స్: 4
సైకాలజీ: 10

ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి  ప్రారంభ తేదీ  22 మే 2020, దరఖాస్తుకు చివరి తేదీ- 10 జూలై 2020


విద్యార్హతలు- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. గేట్, నెట్ స్కోర్ కలిగి ఉండాలి.


దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
 

నోటిఫికేషన్ పూర్తి వివరాల ,.దరఖాస్తు చేయడానికి  https://rac.gov.in/index.php?lang=en&id=0  క్లిక్ చేయండి

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios