హైదరదాబాద్‌ నగరంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ESIC) మెడిక‌ల్ కాలేజ్ లో  కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులకు  తగిన విద్యార్హతలను నిర్ణయించారు.

సరైన అర్హతలు కలిగిన అభ్యర్డులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు 81. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపికలు ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా విడుదలైన పూర్తి వివరాలు మీకోసం.

వివిధ పోస్టుల భ‌ర్తీ వివ‌రాలు

also read AP Jobs : గ్రామ సచివాలయాల్లో 762 ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ...

ప్రొఫెసర్ 06, అసోసియేట్ ప్రొఫెసర్ 12,  అసిస్టెంట్ ప్రొఫెసర్ 05, సీనియ‌ర్ రెసిడెంట్‌ 32, సూప‌ర్ స్పెష‌లిస్ట్ 21, స్పెష‌లిస్ట్‌ 02, జూనియ‌ర్ రెసిడెంట్ 02, ట్యూటర్ 0.


ఖాళీలు ఉన్న విభాగాలు: అనెస్తీషియా, పీడియాట్రిక్స్‌, ఈఎన్‌టీ, రేడియాలజీ, నియోనటాలజీ, ఆప్తాల్మాలజీ, యూరాలజీ, ఆంకాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ,ప్లాస్టిస్ సర్జరీ, నెఫ్రాలజీ, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, హెమటాలజీ, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోఎంటరాలజీ.

అర్హత : పోస్టుల వారీగా తగిన విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/ పీజీ డిప్లొమా అర్హత పొంది ఉండాలి.

వయోపరిమితి: టీచింగ్ పోస్టులకు 69 సంవత్సరాలు, స్పెషలిస్ట్ పోస్టులకు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ పోస్టులకు 37 సంవత్సరాలు, జూనియర్ రెసిడెంట్ పోస్టులకు 30 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా మొత్తం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

also read HWB Jobs: హెవీ వాట‌ర్ బోర్డులో ఉద్యోగాలు....వెంటనే అప్లై చేసుకోండీ


దరఖాస్తు విధానం: సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపికల విధానం:  ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 22.02.2020 చివ‌రితేది: 30.01.2020.

ఇంటర్వ్యూల నిర్వహణ తేదీ 01.02.2020 నుండి 06.03.2020 వరకు.

http://esichydapp.com/