ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) గ్రూప్ సి పరిధిలోని నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 22 నుంచి జూన్ 21, 2019 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, సంబంధిత క్రీడా విభాగంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 121

విభాగాలు: అథ్లెటిక్స్, జూడో, వాటర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్ రోయింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, ఉషూ, ఆర్చరీ, షూటింగ్, వింటర్ గేమ్స్, స్కింగ్(అల్పెన్, నార్డిక్), రెజ్లింగ్ కరాటే.

విద్యార్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా తప్పనిసరి నిర్ధిష్ట ప్రమాణాలు కలిగి ఉండాలి. 

వయసు: 21-06-2019 నాటికి 18-23ఏళ్ల మధ్య ఉండాలి.(నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జీతం: నెలకు రూ. 21,700

దరఖాస్తు ప్రారంభ తేదీ: 22-04-2019
దరఖాస్తులకు చివరి తేదీ: 21-06-2019

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి సంబంధిత  వెబ్‌సైట్‌ను సంప్రదించండి.