రైల్వేలో 310 ఉద్యోగాలు: 14లోపే అప్లై చేయండి

రైల్వేలో ఉద్యోగ నియామకాల జోరు కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇటీవల ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

Indian Railways Recruitment 2019: New vacancies released for   Clerk, JE and other posts

రైల్వేలో ఉద్యోగ నియామకాల జోరు కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇటీవల ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 14, 2019. క్లర్క్, గార్డ్, జేఈ లాంటి పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 15, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: మే 14, 2019

మొత్తం పోస్టుల సంఖ్య: 310
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 12
టెక్నీషియన్-III: 65
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 48
గూడ్స్ గార్డ్- 93
జేఈ/సివిల్: 63
జేఈ/మెకానిక్: 13
జేఈ/ఎలక్ట్రికల్: 11
జేఈ/ఎస్అండ్ టీ: 5

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్:

ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో 50శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, ఎక్స్ సర్వీస్‌మెన్, 12వ తరగతి కన్నా ఎక్కువ విద్యార్హతలున్న అభ్యర్థులకు 50 మార్కుల నిబంధన వర్తించదు. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ తప్పనిసరి.

టెక్నీషియన్-III: నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తో మెట్రిక్యూలేషన్ లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికేట్.

గూడ్స్‌గార్డ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.

జూనియర్ ఇంజినీర్: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా లేదా గ్రాడ్యూయేషన్

వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 42ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47ఏళ్లు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఈస్ట్ కోస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్: నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇతర ఉద్యోగాల వివరాల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios