అర్హతగల అభ్యర్థులందరూ ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 31 డిసెంబర్ 2020న లేదా అంతకుముందు అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్ఎ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సి) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహితులైన అర్హతగల పురుషులు, మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
అర్హతగల అభ్యర్థులందరూ ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 31 డిసెంబర్ 2020న లేదా అంతకుముందు అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పైలట్, అబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్) తదితర విభాగాల్లో 210 ఖాళీలున్నాయి. కరోనా కారణంగా రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 210
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎస్ ఎస్ సీ)- 122 పోస్టులు
టెక్నికల్(ఎస్ ఎస్ సీ)- 70 పోస్టులు
ఎడ్యుకేషన్ బ్రాంచ్- 18 పోస్టులు
also read నిరుద్యోగులకు సువర్ణా అవకాశం.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ...
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకాం బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా/ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి. అలాగే నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక చేసే విధానం: కరోనా కారణంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారా అభ్యర్డులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్వీస్ సెలెక్షన్ బోర్డు(ఎస్ ఎస్ బీ) ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది. కనీసం 8,300 మందిని ఇంటర్య్వూకి ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూలు బెంగళూరు/భోపాల్/విశాఖపట్నం/కోల్‌కతాలో నిర్వహిస్తారు. పైలట్/అబ్జర్వర్ పోస్టులకు ఇంటర్వ్యూ బెంగళూరులో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారమిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ షెడ్యూల్: ఫిబ్రవరి 21, 2021 నుంచి ఉంటాయి.
శిక్షణ కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ) ఎజిమల-కేరళ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేది: 31 డిసెంబర్ 2020
అధికారిక వెబ్ సైట్:https://www.joinindiannavy.gov.in/
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 21, 2020, 5:09 PM IST