Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు సువర్ణా అవకాశం‌.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీస్ విభాగానికి చెందిన 2వేల గ్రూప్ సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త పొందిన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు.

IB ACIO 2020 Exam Notification Released On mha.gov.in, 2000 Vacancies Notified Check Details and  How To Apply
Author
Hyderabad, First Published Dec 19, 2020, 1:49 PM IST

భార‌త ప్ర‌భుత్వ హోంమంత్రిత్వ‌ శాఖ‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీస్ విభాగానికి చెందిన 2వేల గ్రూప్ సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త పొందిన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు.

ఈ పోస్టులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9 జనవరి 2021వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.mha.gov.in/లో  చూడొచ్చు.

ముఖ్యమైన సమాచారం:
అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ (ఏసీఐఓ)-గ‌్రేడ్‌-2/ ఎగ్జిక్యూటివ్‌

మొత్తం ఖాళీలు: 2000
కేట‌గిరీల వారీగా ఖాళీలు: అన్‌రిజ‌ర్వ్‌డ్‌-989, ఈడ‌బ్ల్యూఎస్‌-113, ఓబీసీ-417, ఎస్సీ-360, ఎస్టీ-121.
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి‌.
వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం: రాత ప‌రీక్ష‌(ఆన్‌లైన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

also read ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు‌.. డిగ్రీ అర్హత ఉంటే చాలు..వెంటనే అప్లయి చేసుకోండీ.. ...

ఐ‌బి ఏ‌సి‌ఐ‌ఓ 2020 పరీక్ష ఫీజు: రూ .100
రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు:  రూ .500

జనరల్, ఇడబ్ల్యుఎస్, ఓబిసి వర్గాల పురుష అభ్యర్థులు పరీక్ష ఫీజు + రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి.
ఎస్సీ / ఎస్టీ, మహిళా అభ్యర్థులు & ఎక్స్ఎస్ఎమ్ వారు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించాలి.

ప‌రీక్షా కేంద్రాలు:
తెలంగాణ‌: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.
అభ్య‌ర్థులు గ‌రిష్ఠంగా మూడు ప‌రీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09 జనవరి 2021.
అధికారిక వెబ్‌సైట్‌:https://www.mha.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios