Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ.

ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్ధులు తగిన అర్హతలు కలిగి ఉంటే వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.

indian army jobs notification released for various posts
Author
Hyderabad, First Published Feb 7, 2020, 12:24 PM IST

ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్ధులు తగిన అర్హతలు కలిగి ఉంటే వెంటనే ధరఖాస్తు చేసుకోండీ. ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 189 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఉన్న ఖలీలను నిర్ణయించారు.

విభాగాల వారీగా ఉన్న ఖాళీలు
ఎస్‌ఎస్‌సీ (టెక్‌55) పురుషులు: 175, ఎస్‌ఎస్‌సీడబ్ల్యూ (టెక్‌26) : 14 

also read సెంట్రల్ యూనివర్శిటీలో టీచింగ్ పోస్టులు...వెంటనే అప్లై చేసుకోండీ

బ్రాంచీల వారీగా ఖాళీలు: సివిల్‌ 42, మెకానికల్‌ 14, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ &ఎలక్ట్రానిక్స్‌ 17, సీఎస్‌ఈ/ఐటీ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్‌సైన్స్‌ 58, ఈసీఈ లేదా తత్సమానకోర్సు 21, ఎలక్ట్రానిక్స్‌ 2, ఆప్టో ఎలక్ట్రానిక్స్‌ 2, ఫైబర్‌ ఆప్టిక్స్‌ 2, మైక్రో ఎలక్ట్రానిక్స్‌&మైక్రోవేవ్‌ 2, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ 2, ఆర్కిటెక్చర్‌ 3, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ 2, ఏరోనాటికల్‌ 2, బాలిస్టిక్స్‌ 2, ఏవియానిక్స్‌ 2, ఏరోస్పేస్‌ 2.

శిక్షణ: ఎంపికైన వారికి 49 వారాలపాటు చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు.   

జీతం: లెవల్‌ 10 ప్రకారం రూ.56,100 నుంచి 1,77,500/- ఉంటుంది.

అర్హత: సంబంధిత బ్రాంచీలో డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 

వయస్సు: అభ్యర్డుల వయస్సు  27 ఏళ్ళకు మించరాదు.

also read బీటెక్‌, ఎంఫార్మసీలో కొత్త కోర్సులు...జేఎన్‌టీయూ ఆమోదం...

ఎంపిక చేసే  విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపడతారు. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 

దరఖాస్తు చివరితేదీ: ఫిబ్రవరి 20

అప్లై చేసుకోవడానికి అధికారిక  వెబ్‌సైట్‌: http://joinindianarmy.nic.in పై క్లిక్క్ చేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios