భార‌త ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి సరైన అర్హతలు కలిగి ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఇంటర్ అర్హతతోపాటు, సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అన్ లైన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ విభాగాలలో 300 ఖలీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

aslo read  APPSC : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల..


* హెడ్ కానిస్టేబుల్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ): 300 పోస్టులు

క్రీడాంశాల వారీగా ఖాళీలు:  అథ్లెటిక్స్‌: 91, బాక్సింగ్: 11, బాస్కెట్‌బాల్‌: 08, జిమ్నాస్టిక్స్‌: 04, ఫుట్‌బాల్‌: 06, హాకీ: 12, హ్యాండ్‌బాల్‌: 09, జూడో: 17,  క‌బ‌డ్డీ: 20, షూటింగ్: 32, స్విమ్మింగ్‌: 14,  వాలీబాల్: 08, వెయిట్‌లిఫ్టింగ్‌: 32, రెజ్లింగ్: 20, తైక్వాండో: 16

అర్హత‌: ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత క్రీడ‌లో రాష్ట్రస్థాయి/జాతీయ‌స్థాయి/ అంత‌ర్జాతీయస్థాయి గుర్తింపు సాధించి ఉండాలి అలాగే నిర్దేశిత శారీర‌క ప్రమాణాలు కుడా కలిగి ఉండాలి.

aslo read పోస్టల్ డిపార్టుమెంట్ లో ఉద్యోగాలు...మరో 2 రోజులే గడువు

వ‌యోపరిమితి: 01.08.2019 నాటికి 18-23 సంవత్సరాల వయస్సు మ‌ధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ట‌్రయ‌ల్ టెస్ట్‌, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, మెరిట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

* చివ‌రితేది: 17.12.2019.

* నార్త్-ఈస్ట్ రీజియన్ అభ్యర్థులకు చివరితేది: 24.12.2019.