సీఐఎస్ఎఫ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వెంటనే క్లిక్ చేసుకోండీ..
ఈ నోటిఫికేషన్ ద్వారా 690 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫైనల్ సెలక్షన్ నాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF).. 690 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 690 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఫైనల్ సెలక్షన్ నాటికి ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2021 ఫిబ్రవరి 5 దరఖాస్తుకు చివరితేది.
లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ (LDCE) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 690
అన్ రిజర్వ్‌డ్- 536
ఎస్‌సీ- 103
ఎస్‌టీ- 51
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 4, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2021
వయస్సు: 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్:https://www.cisf.gov.in/