ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.  రైల్వే అప్రెంటిస్‌ ఉద్యోగాల భర్తీకి సౌత్ వెస్ట్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1004 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) అధికారిక వెబ్‌సైట్ https://www.rrchubli.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 9 జనవరి 2021లోగా దరఖాస్తు చేసుకోవాలి. హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్‌లోని క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

మొత్తం  ఉన్న ఖాళీల సంఖ్య- 1004
హుబ్లీ డివిజన్- 287
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ- 217
బెంగళూరు డివిజన్- 280
మైసూరు డివిజన్- 177
సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు- 43

also read ఇంటర్‌ అర్హతతో ఉచిత ప్రభుత్వ ఉద్యోగం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

విభాగాల వారీగా ఉన్న ఖాళీలు:
ఫిట్టర్- 335, ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్)- 117, ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్)- 37, ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్)- 17, వెల్డర్- 55, మెషినిస్ట్- 13, టర్నర్- 13, ఎలక్ట్రీషియన్- 231, కార్పెంటర్- 11, పెయింటర్- 18, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్- 16, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పి‌ఏ‌ఎస్‌ఎస్‌ఏ)- 138, స్టెనోగ్రాఫర్- 2

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. తరువాత ఉద్యోగ అవశాలు కల్పిస్తారు.