బీఎస్ఎఫ్‌లో 1,072 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టులు
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ పలు ఖాళీల భర్తీకి భారత పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ పలు ఖాళీల భర్తీకి భారత పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1,072 హెడ్ కానిస్టేబుల్స్(రేడియో ఆపరేటర్స్, రేడియో మెకానిక్స్) పోస్టులను రెగ్యూలర్ బేసిస్ పద్ధతిలో నియామకం చేపడుతోంది.
ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు మే 14, 2019 నుంచి జూన్ 12, 2019లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టులు: హెడ్ కానిస్టేబుల్స్
సంస్థ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)
విద్యార్హత: ఎస్ఎస్సీ/మెట్రిక్ లేదా తత్సమాన; సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ
నైపుణ్యం: మెడికల్ ఫిట్నెస్
జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.
జీతం: నెలకు రూ. 25,500-81,100
ఇండస్ట్రీ: రక్షణశాఖ
దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 14, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 12, 2019.
వయో పరిమితి:
అభ్యర్థులు జూన్ 12, 2019 వరకు 18ఏళ్లు నిండి ఉండాలి. 25ఏళ్ల(జనరల్ కేటగిరి)కంటే ఎక్కువ ఉండకూడదు. ఓబీసీలకు 28ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 30ఏళ్ల వరకు మినహాయింపు ఉంది.
ఫీజు: 100(జనరల్/ఓబీసీ)
ఎస్బీఐ ఆన్‌లైన్(నెట్ బ్యాంకింగ్/డెబిట్/క్రెడిట్/భీమ్) ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
ఎస్సీ/ఎస్టీ, మహిళలకు పరీక్ష పీజు మినహాయింపు ఉంది.
పోస్టుల వివరాలు:
హెడ్ కానిస్టేబుల్స్(రేడియో ఆపరేటర్): 300
హెడ్ కానిస్టేబుల్స్(రేడియో మెకానిక్): 772
మొత్తం పోస్టుల సంఖ్య: 1,072
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి