భారత ప్రధాన నవరత్న కంపెనీలలో ఒకటైన ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(మిలిటరీ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 09 ఖాళీల భర్తీకి భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు జరుగుతాయి. ఎంపికైన అభ్యర్థుల బెల్ బెంగళూరు యూనిట్‌లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 01, 2019లోగా దరఖాస్తులు చేసుకోవాలి.

పోస్టు పేరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

సంస్థ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)

విద్యార్హత: కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్

అనుభవం: సంబంధిత డొమెయిన్‌లో ఏడాది

జాబ్ లొకేషన్: బెంగళూరు, కర్ణాటక

జీతం: కంపెనీ ప్రమాణాల ప్రకారం.

ఇండస్ట్రీ: ఎలక్ట్రానిక్స్

దరఖాస్తుకు చివరి తేదీ: మే1, 2019

వయో పరిమితి: మార్చి 01, 2019 నాటికి 27ఏళ్లకు మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్. 

దరఖాస్తు విధానం:

బెల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిగా వివరాలను నింపిన తర్వాత అవసరమైన పత్రాలు జత చేసి.. ‘Deputy General Manager (HR/Mil-Com), Military Communication SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru - 560 013’ అడ్రస్‌కు మే 01, 2019లోగా పంపాలి.

దరఖాస్తు ఫాం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.