Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు శుభవార్త... భారీ ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన జగన్ సర్కార్ మరోసారి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

 

AP Grama Volunteer Recruitment 2019... government released fresh notification
Author
Amaravathi, First Published Oct 26, 2019, 3:52 PM IST

అమరావతి: నిరుద్యోగ యువతకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. భారీస్థాయిలో గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నట్లు ఇదివరకే సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9674 గ్రామ వాలంటీర్లు భర్తీకి జగన్ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల  చేసింది. 

 వివిధ కారణాల వలన ఖాళీ అయిన వాలంటీర్ల పోస్టులను తిరిగి భర్తీచేయడానికే ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్  గిరిజా శంకర్ పేర్కొన్నారు.  నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు.నవంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణకు చేపట్టి 15వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేస్తామని వెల్లడించారు.

ఇక 16 నుండి 20 వరకు దరఖాస్తుదారులకు ఎంపిక కమిటీల ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ 22 న ఎంపికయిన అభ్యర్థులకు కాల్ లెటర్లు అందిస్తామని...డిసెంబర్ 1 నుండి కొత్తగా ఎంపికయిన గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరుతారని తెలిపారు. 

read more కార్మికుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆవేదన... ప్రభుత్వంపై సీరియస్

రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీలను ప్రకటించి భర్తీ ప్రక్రియ చేపడతామని... ఈ షెడ్యూల్ ను దృష్టిలో  వుంచుకుని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజా ప్రసాద్ సూచించారు.

నిరుద్యోగాన్ని సాధ్యమైనంతమేర తగ్గిస్తానని ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 2లక్షల గ్రామ వాలంటీర్ పోస్టులను నూతనంగా సృష్టించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత భారీ స్థాయి రిక్రూట్మెంట్ ను విజయవంతంగా నిర్వహించారు. కేవలం గ్రామ వాలంటీర్లే కాకుండా, గ్రామ సచివాలయం పోస్టుల ద్వారా మరో లక్షా 40వేల మందికి ఉద్యోగాలను కల్పించే పనికి శ్రీకారం చుట్టి దానిని కూడా విజయవంతంగా పూర్తిచేసాడు. 

నోటిఫికేషన్లు ఇవ్వడం మాత్రమే కాకుండా, రికార్డు సమయంలోపల ఈ రిక్రూట్మెంట్లను పూర్తి చేసింది జగన్ సర్కార్. ఈ రెండు నియామకాల వల్ల దాదాపుగా 3లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించినట్టయ్యింది. 

read more కార్మికుల ఆత్మహత్యల గురించి తెలుసా...? విజయసాయి గారూ..: బుద్దా వెంకన్న

ఇక ఇప్పుడు మరో మారు గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గత నోటిఫికేషన్లో భర్తీ అవకుండా వివిధ  కారణాలతో మిగిలిపోయిన 9648  పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ వెలువడనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios