ESIC Recruitment 2022: 4,315 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..!
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4,315 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), స్టెనోగ్రాఫర్ (Steno), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4,315 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), స్టెనోగ్రాఫర్ (Steno), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో 72, ఏపీలో 35 ఖాళీలతో పాటు కోల్‌కతా, డెహ్రాడూన్, కాన్పూర్, ఢిల్లీ, జైపూర్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, ఫరీదాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.
మొత్తం 4315 పోస్టుల్లో యూడీసీ 1726, స్టెనో 163, ఎంటీఎస్ 1931 చొప్పున ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్ లో యూడీసీ 25, స్టెనో 4, ఎంటీఎస్ 43, విజయవాడలో యూడీసీ 7, స్టెనో 2, ఎంటీఎస్ 26 ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులకు లాస్ట్ డేట్: ఫిబ్రవరి 15, 2022
వెబ్‌సైట్: www.esic.nic.in