ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఖాళీలు... పదోతరగతి లేదా ఐటీఐ అర్హత ఉంటే చాలు
ఈస్ట్‌కోస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్డులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
also read ఎన్‌టిఆర్ ట్రస్ట్ స్కాలర్ షిప్ టెస్ట్ 2019...
అప్రెంటిస్ పోస్టులు వివరాలు
వాల్తేరు డివిజన్ మొత్తం ఖాళీలు : 553
విభాగాల వారీగా ఖాళీలు : ఫిట్టర్-256, వెల్డర్-64, టర్నర్-14, ఎలక్ట్రీషియన్-120, మెషినిస్ట్-16, డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానిక్)-04, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-01, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్-05, వైర్‌మ్యాన్-10, కార్పెంటర్-24, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-21, ప్లంబర్-09, మాసన్-09.
also read కొచ్చిన్ షిప్‌యార్డ్ నోటిఫికేషన్ 2019 విడుదల...
ఉండాల్సిన అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత పొంది ఉండాలి. కొన్ని విభాగాలకు 8వ తరగతితోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 28.12.2019 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది: 06.01.2020