Asianet News TeluguAsianet News Telugu

DSSSB Recruitment 2022: 878 ఉద్యోగాలు.. అప్లై చేశారా..?

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ 878 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. 

DSSSB Recruitment 2022
Author
Hyderabad, First Published Jan 23, 2022, 5:08 PM IST

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ 878 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ 2022 జనవరి 10వ తేదీ నుండి ప్రారంభ‌మైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

*జూనియర్ ఇంజనీర్ (సివిల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (సివిల్): (575)
-అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
-వేతన:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.


*అసిస్టెంట్ లా ఆఫీసర్ లేదా లీగల్ అసిస్టెంట్:(26) -అర్హతలు:న్యాయశాస్త్రంలో డిగ్రీ పాస్ కావాలి. లీగల్ ప్రాక్టీషియనర్‌గా ఒక ఏడాది అనుభవం తప్పనిసరి.
-వేతన:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.

*అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్):(10)
-అర్హతలు:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
-వేతనం: రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.

*అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్):(151)
-అర్హతలు:సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
-వేతనం:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.

*జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): (116)
-అర్హతలు:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
-వేతనం:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.
-దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 10
-దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 9
-పరీక్ష తేదీ- 2022 మార్చి 1
-వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు
-ఎంపిక విధానం- టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్
-దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు.

*అప్లై చేయడాని వెబ్ సైట్ లింక్:
https://dsssb.delhi.gov.in/

*దరఖాస్తు లింక్ 2022 జనవరి 10 నుంచి అందుబాటులో ఉంటుంది.
-లేదా అభ్యర్థులు నేరుగా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Follow Us:
Download App:
  • android
  • ios