హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డి‌ఆర్‌డి‌ఓ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 10 జూనియర్ రీసెర్చ్ ఫెలో (జే‌ఆర్‌ఎఫ్) పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు.

అయితే డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (డి‌ఆర్‌డి‌ఎల్)లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 14 దరఖాస్తు చేసుకోవడానికి  చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.drdo.gov.in/ చూడవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 10
మెకానికల్ ఇంజినీరింగ్- 7
ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్- 3

also read సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ టీచర్‌ ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి ...

అర్హతలు: జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్‌. ఏరోనాటికల్ పోస్టులకు సంబంధిత‌ బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అయితే గేట్ స్కోర్ తప్పనిసరి పొంది ఉండాలి.
వయసు: అభ్య‌ర్థుల వయసు 28 ఏళ్ల లోపు వారై ఉండాలి.
జీతం: రూ.31,000
ద‌ర‌ఖాస్తు విధానం: నిర్ణీత న‌మూనాలో దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తిగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సంబంధిత అడ్ర‌స్‌కు పోస్టులో పంపించాలి.

అడ్రస్: 
The Director, 
DRDL, Dr. APJ Abdul Kalam Missile Complex,
Kanchanbagh PO, 
Hyderabad – 500058

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: 14 జూన్ 2021
అధికారిక వెబ్‌సైట్: https://www.drdo.gov.in/