Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్ టీచర్‌ ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్  టీచర్ ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 5 దరఖాస్తులకు చివరి తేది. 
 

bolarum teachers recruitment 2021 released apply for 33 tgt pgt prt posts here now
Author
Hyderabad, First Published May 22, 2021, 6:04 PM IST

హైదరాబాద్ లో టీచర్ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే  సికింద్రాబాద్‌ ప్రాంతంలోని  భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన  రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీఎస్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 5 దరఖాస్తులు చేసుకోవడానికి  చివరితేది. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక  వెబ్ సైట్ http://www.apsbolarum.edu.in/index.htmlచూడొచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్లు, లైబ్రేరియన్‌ తదితరాలు.
విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్‌ సైన్స్‌ తదితరాలు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ):
అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ):
అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57ఏళ్లు మించకూడదు.

also read రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష లేకుండా ఎంపిక.. వెంటనే అప్లయి చేసుకోండీ.. ...

ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ):
అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

లైబ్రేరియన్‌:
అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ(లైబ్రరీ సైన్స్‌)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.

సెక్యూరిటీ సూపర్‌వైజర్‌:
అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. 55 ఏళ్లు నిండిన ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాధాన్యం ఇస్తారు.

కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌:
అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా 
ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, 
బొల్లారం, జేజే నగర్, 
సికింద్రాబాద్‌–500087

దరఖాస్తులకు చివరి తేది: 5 జూన్‌ 2021

అధికారిక వెబ్‌సైట్‌:http://www.apsbolarum.edu.in/index.html

Follow Us:
Download App:
  • android
  • ios