బ్రాడ్‌ కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)లో కాంట్రాక్ట్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

న్యూఢిల్లీలోని బ్రాడ్‌ కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)లో కాంట్రాక్ట్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఉన్న ఖాళీల సంఖ్య 50.

also read CIL Jobs: కోల్ ఇండియాలో ఉద్యోగాలు...మొత్తం 1326 పోస్టులు

డేటాఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల వివ‌రాలు: డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు (హిందీ/ఇంగ్లిష్)

ఉండాల్సిన అర్హత‌: ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌ పొంది ఉండాలి. హిందీ/ ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్‌పై ఒక నిమిషానికి 35 పదాలను టైప్ చేయగలగాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పోస్ట్ పంపాలి.

ఎంపిక విధానం: కంపెనీ నిబంధనల ప్రకారం.

దరఖాస్తు ఫీజు: అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 'BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED' పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి.

also read Railway Jobs:సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు...స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

Deputy General Manager (HR)

BECIL's Corporate Office, BECIL Bhawan,

C-56/A-17, Sector-62,

Noida-201307 (U.P).