చ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం‌లోని బిలాస్‌పూర్‌ నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వే' స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-సి క్యాటగిరి కింద (లెవల్ 2, 3, 4, 5) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-సి క్యాటగిరి పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 26 ఖాళీలను  గ్రూప్-సి క్యాటగిరి కింద భర్తీకి ఉన్నాయి.

స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-సి క్యాటగిరి ​పోస్టుల వివ‌రాలు.

also read సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల...స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు...

క్రీడాల వారీగా ఉన్న ఖాళీలు.

అథ్లెటిక్స్‌ 02, బ్యాడ్మింట‌న్‌ 04, బాస్కెట్ బాల్‌ 04, బాక్సింగ్‌ 03, క్రికెట్‌ 04, హ్యాండ్‌బాల్ 03, హాకీ 03, క‌బ‌డ్డీ 01, ఖోఖో 01, వాలీబాల్ 01

ఉండాల్సిన అర్హత: పోస్టుల వారీగా తగిన విద్యార్హతలు నిర్ణయించారు. పదోతరగతితో పాటు ఐటీఐ, ఇంట‌ర్, డిగ్రీ అర్హత పొంది ఉండాలి. సంబంధిత క్రీడ‌లో జాతీయ‌/ అంత‌ర్జాతీయ స్థాయిలో పాల్గొని ఉండాలి.


వయస్సు : 01.01.2020 నాటికి 18-25 సంవత్సరాల మ‌ధ్య వయస్సు వారై ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

also read Metro Rail Jobs: మెట్రో రైల్‌లో ఉద్యోగ అవకాశాలు...మొత్తం ఖాళీలు ఇవే

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కుల టెస్ట్ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. వీటిలో సంబంధిత క్రీడా విభాగంలో ప్రతిభ, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు 40 మార్కులు, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్‌కు 50 మార్కులు, విద్యార్హత‌కు 10 మార్కులను కేటాయించారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ క్యాటగిరి వారు రూ.500 చెల్లించాలి. ఎస్‌సి, ఎస్‌టి, మహిళలు, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివ‌రితేది 13 జనవరి 2020.