కేంద్ర ప్రభుత్వ బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్  ద్వారా మొత్తం 11 విభాగాలకు చెందిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు.

సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు 21 డిసెంబరు నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ.  దరఖాస్తు చేసుకోవాడానికి చివరి తేదీ 19  జనవరి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఫిబ్రవరిలో ఆన్‌లైన్ విధానం ద్వారా రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రైనీ   పోస్టులు 1326.
 

కోల్ ఇండియాలో భర్తీకి ఉన్న పోస్టుల వివరాలు.

పోస్టుల కేటాయింపు: జనరల్ 485, ఈడబ్ల్యూఎస్ 132, ఎస్సీ 206, ఎస్టీ 142, ఓబీసీ (NCL)-361.

also read  Railway Jobs:సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు...స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ విడుదల

విభాగాల వారీగా ఉన్న ఖాళీలు : మైనింగ్  228, ఎలక్ట్రికల్ 218, మెకానికల్ 258, సివిల్ 68, కోల్ ప్రిపరేషన్ 28, సిస్టమ్స్ 46, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ 28, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 254, పర్సనల్ & హెచ్ఆర్ 89, మార్కెటింగ్ & సేల్స్ 23, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ 26.

ఉండాల్సిన అర్హత : పోస్టుల వారీగా తగిన విద్యార్హతలు నిర్ణయించారు. బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్), సీఏ/ఐసీడబ్ల్యూఏ, పీజీ డిగ్రీ (హెచ్ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్)/ఎంబీఏ/ మాస్టర్ డిగ్రీ(సోషల్ వర్క్), పీజీ డిగ్రీ అర్హత పొంది ఉండాలి.

వయోపరిమితి: కోల్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.04.2020 నాటికి 30 సంవత్సరాలలోపు వారై ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేష్, మెడికల్ టెస్ట్ ద్వారా.

ఆన్‌లైన్ పరీక్ష విధానం: మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కుల ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులను, ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు.

also read  Railway Jobs:సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల...స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు...

పేపర్-1లో జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి.పేపర్-2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ గురించి ప్రశ్నలు ఉంటాయి. అయితే మల్టీపుల్ ఛాయిస్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు(కట్ ఆఫ్ మార్క్స్) ఉండవు.

అర్హత కోసం పొందాల్సిన మార్కులు: రాతపరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40, ఓబీసీ అభ్యర్థులకు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30గా నిర్ణయించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

పర్సనల్ ఇంటర్వ్యూ : రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయి. అభ్యర్థుల ఎంపిక జాబితాను వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటిస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూలును అభ్యర్థుల ఈమెయిల్‌కు పంపిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా వెబ్‌సైట్‌లో అలాగే అభ్యర్థుల ఈమెయిల్‌కి కూడా పంపిస్తారు.


ఆన్‌లైన్ పరీక్ష తేది: 27.02.2020 & 28.02.2020

వేతనం: మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.50వేలు వేతనంగా ఇస్తారు. శిక్షణ తర్వాత నెలకు రూ.60వేలు అందజేస్తారు. ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి.