పట్టువదలని విక్రమార్కుడు... ఈ యూపీఎస్సీ ర్యాంకర్..!
2018లో మూడవ ప్రయత్నంలో ఆయన 940వ ర్యాంకు సాధించాడు. ఆయన సంతృప్తి లభించక మరోసారి రాయడం గమనార్హం. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈయన 587 వ ర్యాంకు సాధించడం గమనార్హం.
జీవితంలో ఏది సాధించాలన్నా పట్టుదల చాలా ముఖ్యం. పట్టుదల లేకుంటే జీవితంలో ఏది సాధించలేరు అనేది అక్షర సత్యం. దీనికి సరైన ఉదాహరణ ఈ UPSC 587 వ ర్యాంకర్ సుమిత్ కుమార్. ఒక్కసారి యూపీఎస్సీకి రాయడం అంటేనే కష్టం. అలాంటిది.. ఈ సమిత్ కుమార్.. మాత్రం ఒక్కసారి కాదు.. ఏకంగా ఐదు సార్లు యూపీఎస్సీ కి ప్రయత్నించడం గమనార్హం.
అతను మళ్లీ..యూపీఎస్సీకి పరీక్ష కు ప్రయత్నిస్తానంటూ చెప్పడం గమనార్హం. 2018లో మూడవ ప్రయత్నంలో ఆయన 940వ ర్యాంకు సాధించాడు. ఆయన సంతృప్తి లభించక మరోసారి రాయడం గమనార్హం. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈయన 587 వ ర్యాంకు సాధించడం గమనార్హం.
2015 లో లక్నోలోని ఐఐటి ఇంజనీరింగ్ కాలేజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, అతను యుపిఎస్‌సి పరీక్షకు సిద్ధమవడం ప్రారంభించాడు.
ప్రస్తుతం అతను ఉత్తరాఖండ్‌లోని టెలికాం డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కానీ అతని కల ఇంకా నెరవేరలేదు. సుమిత్ కుమార్ ఐఏఎస్ కావాలని అనుకున్నాడు. కానీ.. అతని కలమాత్రం కచ్చితంగా నెరవేర్చుకోవాలని అనుకుంటూనే ఉన్నాడు. దాని కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వైఫల్యాలు ఎదురైనా ఎక్కడ తగ్గలేదు. అతను ఇక్కడితో ఆగలేదు, అతను UPSC పరీక్ష కోసం తన ప్రిపరేషన్ కొనసాగించాడు
ఐదుసార్లు ప్రయత్నించి తన కల నెరవేర్చుకున్నాడు. ఈసారి అతను 587 వ ర్యాంక్ పొందాడు. కానీ అతను తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పటికీ వారు ప్రస్తుత ర్యాంకును బట్టి IRPS లేదా ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ సర్వీస్ (IAAF) కేడర్ పొందవచ్చు.
సుమిత్ కుమార్ తండ్రి చౌతి రామ్ పాశ్వాన్ 2015 లో ఆరోగ్య శాఖ సేవ నుండి రిటైర్ అయ్యారు. తల్లి గిరిజా దేవి గృహిణి. గ్రాడ్యుయేషన్ తరువాత, అతనికి కాలేజీలో ప్లేస్‌మెంట్ లభించలేదు, కాబట్టి అతను పరీక్షకు సిద్ధం కావడానికి ఢిల్లీకి వెళ్లాడు. ప్రిపరేషన్ సమయంలో అతనికి కుటుంబం నుండి పూర్తి మద్దతు లభించింది. సత్వర విజయం సాధించిన తర్వాత, అనేక హెచ్చు తగ్గులు ఉంటాయి. మొదట విజయం సాధించింది. విజయం సాధించకుండా మళ్లీ ప్రయత్నించారు. ఈసారి కూడా అతనికి వచ్చిన ర్యాంక్ అతని ఆశించిన విధంగా లేదు.
పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు అతను చాలా సార్లు నిరాశ చెందేవాడట. కానీ అతని కల అతనికి ధైర్యాన్నిచ్చింది. కల చాలా పెద్ద విషయం అని సుమిత్ కుమార్ చెప్పారు. కలను నెరవేర్చాలనే కోరిక మిమ్మల్ని మళ్లీ ప్రయత్నించడానికి ప్రేరేపిస్తుందని అతను చెప్పాడు. సమాజంలో చూసే విషయాల్లో మార్పు తేవాలనుకుంటున్నాని ఆయన చెప్పారు.. సరైన స్థానాన్ని పొందడం ద్వారా మాత్రమే మార్పు తీసుకురావచ్చు అనేది ఆయన అభిప్రాయం.
కాగా.. తన విజయానికి తనకు తల్లిదండ్రులతో పాటు.. ఉపాధ్యాయులు సైతం పూర్తిగా సహకరించారని.. వారి కారణంగానే తాను ఈరోజు ఇలా ఉన్నానంటూ ఆయన చెప్పడం గమనార్హం.