ఇంటర్ విద్యార్డుల కోసం తెలంగాణలో ఎంసెట్‌ ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ ను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌ విడుదల చేసింది. టీఎస్‌ ఎంసెట్‌ (తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - 2020 రాయలనుకునే వారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ పూర్తి చేసిన వారు బి-టెక్ లో చేరాలనుకునే విద్యార్ధులు వెంటనే అప్లై చేసుకోండీ. ఎంట్రన్స్ పరీక్షలో అర్హత పొందిన వారు బి-టెక్ చేయడానికి అర్హులు. 
  
టీఎస్‌ ఎంసెట్‌ (తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - 2020 వివరాలు

also read చెఫ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం...వెంటనే అప్లై చేసుకోండీ

కోర్సులు: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు. 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్‌) మార్కులు, ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 21 నుంచి మొదలవుతుంది.

also read  సీఎం విదేశీ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం...వెంటనే అప్లై చేసుకోండీ

చివరి తేదీ: మార్చి 30

ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 చెల్లించాలి, మిగిలిన వారికి రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ ఏప్రిల్‌ 06 నుంచి 09 వరకు.

ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీలు: మే 4, 5, 7 

అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షతేదీలు:   మే 9, 11న పరీక్షలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in చూడండి.