Asianet News TeluguAsianet News Telugu

ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీ ఫైన‌ల్ సెమ్‌ ప‌రీక్ష‌లు!

వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులను ఆగస్టు మధ్య నాటికి పరీక్ష ఫీజులను చెల్లించాలని విశ్వవిద్యాలయం కోరింది. ఎల్‌ఎల్‌బి (3 సంవత్సరం), ఎల్‌ఎల్‌బి హానర్స్ (3 సంవత్సరం), బి‌ఏ.ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), బి‌బి.ఏ.ఎల్‌ఎల్.బి  (5 సంవత్సరం), బి.కాం ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), మాస్టర్ ఆఫ్ లా (ఎల్‌ఎల్‌ఎం). 

Osmania University To held  End-Semester Examinations in August and September
Author
Hyderabad, First Published Jul 25, 2020, 12:34 PM IST

న్యూ ఢీల్లీ: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చివరి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులను ఆగస్టు మధ్య నాటికి పరీక్ష ఫీజులను చెల్లించాలని విశ్వవిద్యాలయం కోరింది.

ఎల్‌ఎల్‌బి (3 సంవత్సరం), ఎల్‌ఎల్‌బి హానర్స్ (3 సంవత్సరం), బి‌ఏ.ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), బి‌బి.ఏ.ఎల్‌ఎల్.బి  (5 సంవత్సరం), బి.కాం ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), మాస్టర్ ఆఫ్ లా (ఎల్‌ఎల్‌ఎం). ఈ విభాగాల విద్యార్థులు తమ పరీక్ష ఫీజును ఆగస్టు 12 లోగా లేదా ఆగస్టు 19 లోగా లెట్ ఫీజుతో  చెల్లించాలని విశ్వవిద్యాలయం కోరింది.

మాస్టర్ ఆఫ్ అప్లైడ్ మేనేజ్‌మెంట్ (ఎం‌ఏ‌ఎం), 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిబిఎ / ఎంబీఏ కోర్సులకు రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు కూడా జరుగుతాయి. ఈ విభాగాల విద్యార్థులు పరీక్ష ఫీజును ఆగస్టు 6 లోగా, ఆగస్టు 14 లోపు లేట్ ఫీజుతో  చెల్లించాలి.

also read ఎన్ఐడి ఎంట్రెన్స్ ప‌రీక్ష ఫలితాలు విడుద‌ల‌.. వివరాల కోసం క్లిక్ చేయండి ...

యుజిసి విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం 209 విశ్వవిద్యాలయాలు పరీక్షను నిర్వహించగా, 394 మాత్రం ఆగస్టు 23 లేదా సెప్టెంబర్ నాటికి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.

జూలై 6న విడుదల చేసిన యుజిసి  సవరించిన మార్గదర్శకాలలో విశ్వవిద్యాలయాలను ఎండ్-సెమిస్టర్ పరీక్షలు, సెప్టెంబర్ చివరి నాటికి 'తప్పనిసరి' బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించాలని కోరింది..

యూ‌జి‌సి నిర్ణయం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలో పదేశే కమిషన్ను రాష్ట్రాలు, విద్యావేత్తలు, విద్యార్థుల నుండి చాలా విమర్శలకు గురైంది. మార్గదర్శకాలను సవాలు చేస్తూ వివిధ రాష్ట్రాలకు చెందిన 31 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి యుజిసి మార్గదర్శకాలను ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జూలై 30 న మరోసారి విచారించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios