న్యూ ఢీల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) బిడిఎస్-జిడిపిడి ప్రవేశానికి ఎన్ఐడి డి‌ఏ‌టి (డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్) మెయిన్స్ తుది ఫలితాన్ని ప్రకటించింది. విద్యార్థులు తమ ఇమెయిల్ ఐడిలు, పుట్టిన తేదీలను ఉపయోగించి ఎన్ఐడి అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌ఐడి డి‌ఏ‌టి 2020 ఫలితాలని యాక్సెస్ చేయవచ్చు.

డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (DAT) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (BDes), గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (GDPD) లో అడ్మిషన్ కోసం జూన్ చివరిలో ఎన్ఐడి డి‌ఏ‌టి 2020 మెయిన్స్ (ఆన్‌లైన్ ఇంటరాక్షన్) పరీక్ష నిర్వహించారు.

2020-21 అకాడెమిక్ సెషన్ కోసం ఈ సంవత్సరం పరీక్షలు నిర్వహించే సంస్థ ఎన్ఐడి డి‌ఏ‌టి 2020 ప్రిలిమ్స్, ఎన్ఐడి డాట్ 2020 మెయిన్స్ వెయిటేజీని సవరించింది.  డి‌ఏ‌టి ప్రిలిమ్స్ 70 శాతం మార్కులతో అధిక వెయిటేజీ,  డి‌ఏ‌టి మెయిన్స్ లో 30 శాతం వెయిటేజీ ఉండాలని తెలిపింది.

ఎన్‌ఐడి డి‌ఏ‌టి 2020 మెయిన్స్  క్లియర్ చేసే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్‌లోని ఎన్‌ఐడి క్యాంపస్‌లలో అడ్మిషన్ పొందవచ్చు.

ఎన్‌ఐడి డి‌ఏ‌టి 2020 ఫలితాలు ఎలా చూసుకోవాలంటే ?

also read సి‌ఆర్‌పి‌ఎఫ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండీ.. ...

 1: ఎన్‌ఐడి  అధికారిక రిసల్ట్స్ వెబ్‌సైట్‌ - nid.edu/NIDA2020/ results సందర్శించండి 

 2: అందించిన ఖాళీలలో మీ ఇమెయిల్ ఐడిలు, పుట్టిన తేదీలను ఎంటర్ చేయండి 

3: ఎన్‌ఐడి డి‌ఏ‌టి 2020 ఫలితాల కోసం సబ్మీట్ పై క్లిక్ చేసి రిసల్ట్స్ యాక్సెస్ చేయండి

ఎన్‌ఐడి డి‌ఏ‌టి 2020 పరీక్షలపై  కోవిడ్-19 ప్రభావం

ఎన్‌ఐడి డి‌ఏ‌టి  ప్రిలిమ్స్ పరీక్షలు 2019 డిసెంబర్ 29న జరిగాయి, అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మెయిన్స్ ఆలస్యం అయ్యాయి. జూన్ 23, 2020 నిర్వహించవలసి వచ్చింది. 2020-21 అకాడెమిక్ అడ్మిషన్స్ కోసం ఎన్‌ఐడి డి‌ఏ‌టి 2020 మెయిన్స్ పరీక్షలు ఆన్‌లైన్‌ ద్వారా జరిగాయి.