హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు మంచి అవకాశం. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(nithm) శిక్షణ సంస్థ నిరుద్యోగ యువతకు కోసం చెఫ్‌ కోర్సులలో శిక్షణ పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలి అని కోరుతున్నరు.

also read  సీఎం విదేశీ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం...వెంటనే అప్లై చేసుకోండీ

ఎస్సీ సర్వీస్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఈడీ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని  తెలిపారు. ఆరు నెలల కాలపరిమితితో 10వ తరగతి, ఇంటర్‌ విద్యార్హత కలిగిన వారు చెఫ్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులకు చక్కటి హాస్టల్‌ వసతి కల్పించనున్నారు.

 దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-35 ఏండ్ల లోపు ఉండాలన్నారు. దరఖాస్తుతోపాటు ఆదాయం, కులం, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్‌ జతచేసి ఎస్సీ కార్యాలయంలోని కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లో సమర్పించాలన్నారు.

also read ఏ‌పి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల...

ఈ నెల 22వ తేదీ చివరి గడువులోగా దరఖాస్తులు అందించాలని తెలిపారు. కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకూ ప్రైవేట్‌ సెక్టార్‌లలో ఉద్యోగావకాశాలను కూడా కల్పించనున్నామని పేర్కొన్నారు.