Asianet News TeluguAsianet News Telugu

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. తెలంగాణ‌లో ఎంట్రన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖ‌రారు..

మార్చ్ నుండి మూడు నెలల లాక్ డౌన్ తరువాత స్కూల్స్, కాలేజీలు ఇంకా మొదలు కానీ పరిస్థితి. అయితే లాక్ డౌన్ సడలింపుతో తెలంగాణ‌ రాష్ట్రంలో వివిధ ప్ర‌వేశ‌ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ ఖ‌రారు చేశారు. 

common entrance exams schedule finalaised in telangana state
Author
Hyderabad, First Published Aug 22, 2020, 3:41 PM IST

హైద‌రాబాద్‌: కరోనా వైరస్, లాక్ డౌన్  కారణాంగా విద్యా వ్యవస్థతో పాటు అనేక ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చ్ నుండి మూడు నెలల లాక్ డౌన్ తరువాత స్కూల్స్, కాలేజీలు ఇంకా మొదలు కానీ పరిస్థితి.

అయితే లాక్ డౌన్ సడలింపుతో తెలంగాణ‌ రాష్ట్రంలో వివిధ ప్ర‌వేశ‌ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ ఖ‌రారు చేశారు. రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఎంట్రన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ తేదీలను వెల్లడించనుంది.

గ‌తంలోనే తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసిన‌ప్ప‌టికీ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని వాయిదా నిర్వహించకుండ వాయిదా వేయాల్సి వచ్చింది.

also read యూపీఎస్‌సి నోటిఫికేష‌న్ విడుద‌ల.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ ఉన్న‌త‌ విద్యామండ‌లి తాజాగా నూత‌న షెడ్యూల్‌ను ఖ‌రారు చేసి ప‌రీక్ష‌లు నిర్వ‌హిండానికి సిద్ధమైంది. క‌రోనా నిబంధ‌న‌లు, మార్గదర్శకాలు పాటిస్తూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

తాజాగా నిర్ణయించిన షెడ్యూల్ ప్ర‌కారం ఆగ‌స్టు చివరీలో  అంటే 31న టీఎస్ ఈసెట్‌ ప‌రీక్ష, తరువాత వచ్చే నెల సెప్టెంబ‌ర్ 9 నుంచి 14 వ‌ర‌కు ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

సెప్టెంబ‌ర్ 21 నుంచి 24 వ‌ర‌కు పీజీ ఈసెట్‌, సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష‌లు ఉంటాయి. సెప్టెంబ‌ర్ 30, అక్టోబ‌ర్ 1న టీఎస్ ఐసెట్‌, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు ఎడ్‌సెట్‌, అక్టోబ‌ర్ 4న లాసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.

ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఎంతో కాలం నుండి వాయిదా పడ్డ ఎంట్రన్స్ పరీక్షల గురుంచి సతమతవుతున్న విద్యార్ధులకు తాజా ప్రకటనతో ఊరటనిచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios